ఉత్తర కొరియా-అమెరికా మధ్య కుదరని ఒప్పందం...

SMTV Desk 2019-02-28 18:53:35  Donald Trump, Kim Jong-un

హనోయి, ఫిబ్రవరి 28: ఈ రోజు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తో అగ్ర రాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ హనోయిలో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో మెట్రోపాల్‌ హోటల్‌ లీ క్లబ్‌లో వర్కింగ్‌ లంచ్‌ చేశారు ఇద్దరు. అయితే వారిద్దరు నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తుంది. ఇద్దరి నేతల మధ్య అణు నిరాయుధీక‌ర‌ణ‌పై ఒప్పందం కుద‌ర‌లేద‌ని సమాచారం. ఉత్త‌ర కొరియాపై విధించిన ఆంక్ష‌ల అంశంలో రెండు దేశాల మ‌ధ్య భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సంయుక్తంగా నిర్వ‌హించాల్సిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ను ర‌ద్దు చేశారు. చ‌ర్చ‌లు జ‌రిగినా, ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌లేద‌ని వైట్‌హౌజ్ వెల్ల‌డించింది.