'ఎన్టీఆర్ మహానాయకుడు' పై ఏపీ సీఎం కామెంట్స్....

SMTV Desk 2019-02-28 17:33:41  AP SM Chandrababu, NTR Mahanayakudu, NTR Kathanayakudu, Balakrishna, Krish jagarlamudi

అమరావతి, ఫిబ్రవరి 28: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్ర పోషించాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా చేసి పోయిన సంక్రాంతికి మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను విడుదల చేశారు. ఇక రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను తాజాగా విడుదల చేశారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను అంతగా సంతృప్తిపరచలేదు. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌ను రానా దగ్గుబాటి పోషించారు. తాజాగా ‘మహానాయకుడు’ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లందరూ మహానాయకుడు చూడాలని తద్వారా తాము పేదలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామో తెలుస్తుందన్నారు. రేషన్ డీలర్లకు ఐదు రెట్లు కమీషన్ పెంచామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రేషన్ షాపులు మినీ సూపర్‌బజార్‌లుగా మారాలని సీఎం ఆకాంక్షించారు. ఎమ్మెస్ఎన్వీ పార్కుల ద్వారా లోకల్ సరుకులు విదేశాలకు పంపిస్తామని చంద్రబాబు వెల్లడించారు. బియ్యం ధర రూపాయి ఉంటే.. డీలర్‌కు ఇచ్చే కమీషన్ కూడా రూపాయి ఇస్తున్నామన్నారు.