`బాహుబ‌లి` నా కెరీర్‌ను నిలబెట్టింది: త‌మ‌న్నా

SMTV Desk 2019-02-28 17:29:22  Tamanna, Rajamouli, Bahubali

హైదరాబాద్, ఫిబ్రవరి 28:తెలుగు, త‌మిళ సినీ రంగాల్లోని దాదాపు అగ్ర‌హీరోలంద‌రితోనూ న‌టించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ, అవ‌న్నీ ప‌రాజ‌యాలుగానే నిలిచాయి. ఈ ద‌శ‌లో `బాహుబ‌లి` సినిమా ఆమెకు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిపెట్టింది. `అవంతిక‌`గా ఆ సినిమాలో త‌మ‌న్నా గ్లామ‌ర్ విందు చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌న్నా `బాహుబ‌లి` గురించి మాట్లాడింది. `నేను బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేశాను. అవన్నీ భారీ సినిమాలే. కానీ విజ‌య‌వంతం కాలేదు. అలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంద‌ర్భంలోనే `బాహుబ‌లి` అవ‌కాశం వ‌చ్చింది. అప్ప‌టికి ఏడాదిగా ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఆ ద‌శ‌లో రాజ‌మౌళిగారి నుంచి పిలుపు వ‌చ్చింది. అతిథి పాత్ర కోసం అనుకున్నా. కానీ, అవంతిక పాత్ర గురించి విని ఎంతో ఆనంద‌ప‌డ్డా. చాలా అంద‌మైన పాత్ర అది. ఆ సినిమా నాకు చాలా గుర్తింపు తెచ్చింది. నాపై న‌మ్మ‌క‌ముంచినందుకు రాజ‌మౌళి స‌ర్‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌`ని త‌మ‌న్నా చెప్పింది.