కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి రెడ్‌మీ నోట్7

SMTV Desk 2019-02-28 17:20:24  Red mi, Xiomi, Red mi Smart phone, MI NOTE 7

ఫిబ్రవరి 28: షియోమీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్7 ను ఈ రోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 2 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా దీంట్లో అందిస్తున్నారు. ఇక డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.9,999 ధరకు లభిస్తుండగా, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.11,999 ధరకు లభిస్తున్నది.

రెడ్‌మీ నోట్ 7 ఫీచర్లు :

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌
3/4 జీబీ ర్యామ్‌
32/64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
డ్యుయల్ సిమ్‌
12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
ఐఆర్ సెన్సార్‌
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.0
యూఎస్‌బీ టైప్ సి
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
క్విక్ చార్జ్ 4.0.