భారత్-పాక్ నుంచి ఆశిస్తున్నా: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్

SMTV Desk 2019-02-28 17:03:17  pakistan, donald trump, kim jong-un, us president

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: భారత్-పాక్ ల నుంచి త్వరలోనే మంచి కబురు వింటానని ఆశిస్తున్నానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో భేటీ అయిన అనంతరం, విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తతల అంశం త్వరలో ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, భారత్, పాక్ విదేశాంగ శాఖా మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో మాట్లాడారు.