డిఫరెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో ‘డిస్కోరాజా’

SMTV Desk 2019-02-28 16:28:45  RAVITEJA, Samantha, Disco raja

హైదరాబాద్, ఫిబ్రవరి 28:మాస్‌ మహరాజ్ రవితేజ ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్స్ సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క రాజా ది గ్రేట్ తప్ప ఆ తరువాత చేసిన సినిమాలేవి ఆకట్టుకోకపోవటంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డిస్కోరాజా మీదే ఆశలు పెట్టుకున్నాడు మాస్‌ మహారాజ్‌.

విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. వృద్ధుడిగా, యువకుడిగా రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

అయితే ఈ కథ సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ బేబీ సినిమా కథను పోలి ఉండటంతో రవితేజ పునరాలోచనలో పడ్డట్టుగా ప్రచారం జరుగుతోంది. కథలో మార్పలు చేసిన తరువాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారట డిస్కోరాజా యూనిట్. దీంతో డిస్కోరాజా కథ మళ్లీ మొదటికొచ్చినట్టైందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.