ఎమ్మెల్సీగా పోటీ చేయనున్న ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు

SMTV Desk 2019-02-28 16:14:48  TDP, Andhrapradesh MLC elections, APNGO Leader ashok babu, Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 28: గత కొద్ది రోజులుగా ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగింది. కాని ఈ విషయంపై అశోక్ బాబు ఎప్పుడూ నోరు మెదుపలేదు కాని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా విడుదల చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అశోక్ బాబు ఒకరిగా ఉన్నాడు. దీంతో అశోక్ బాబు టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు అశోక్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అశోక్ బాబు తెలిపారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అశోక్‌బాబు ప్రకటించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నుంచి ఒకరికి అవకాశం ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీకి కట్టుబడి అశోక్ బాబుకు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు.