మహర్షి విషయంలో మహేష్ క్లారిటీ

SMTV Desk 2019-02-28 15:38:23  Mahesh Babu, Pooja Hegde, Vamshi Paidipally, Dilraj, Maharshi

హైదరాబాద్, ఫిబ్రవరి 28: టాలివుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'మహర్షి' తన 25 చిత్రం. ఈ సినిమా విడుదల తేది పట్ల అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా అప్డేట్లు రావట్లేదు అని అభిమానులు విచారించగా, టీజర్, ట్రైలర్ విడుదల తేదీలు బయటకి రాకుండా ఏకంగా సినిమా విడుదల డేట్ బయటకి వచ్చేసింది. ఈ విషయాన్నీ స్వయంగా ఈ చిత్ర సహా నిర్మాత దిల్ రాజే ఏప్రిల్ 25న విడుదల అవుతుందని వెల్లడించారు. దీంతో అభిమానులు ఆ డేట్ ను ఫిక్సయ్యిపోయారు.

తరువాత ఏప్రిల్ లో కాదు వచ్చే జూన్ కి ఈ సినిమా వాయిదా పడింది అని, సినిమా ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది అని, ఇలా ఈ సినిమాపై వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాపై కన్ఫ్యూజన్లన్నిటికి తెర దించుతూ మహేష్ ఈ రోజు ఫైనల్ విషయాన్ని ఇచ్చేసారు. సినిమా విడుదల తేదీ పట్ల ఎలాంటి మార్పులు చేయలేదని, అనుకున్న డేట్ రోజునే ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకి రెడీగా ఉందని ప్రకటించేసారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

కాగా మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మహేష్‌కు జోడిగా పూజా హెగ్దే నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి కె.యు. మోహనన్ నినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.