నయనతార, కీర్తి సురేశ్ - ఈ ఇద్దరిలో ఎవరు?

SMTV Desk 2019-02-28 15:37:21  RAJINI, RAJINIKANTH, KIRTHISURESH

హైదరాబాద్, ఫిబ్రవరి 28:రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ముందుగా కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెరపైకి నయనతార పేరు వచ్చింది. దాంతో ఇద్దరినీ తీసుకుంటారా? లేదంటే ఎవరో ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకుంటారా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది.

ఈ నేపథ్యంలో రజనీ సరసన కథానాయికలుగా ఈ ఇద్దరినీ ఖరారు చేసుకున్నారనేది తాజా సమాచారం. రజనీతో జోడీ కట్టడమనేది కీర్తి సురేశ్ కి ఇదే మొదటిసారి. ఇక 'చంద్రముఖి' తరువాత రజనీ సరసన నాయికగా నయనతార రెండోసారి కనిపించనుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.