నిహారిక కోసం నాగ చైతన్య

SMTV Desk 2019-02-28 15:37:14  NAGACHAITANYA, NIHARIKA, SURYAKANTHAM

హైదరాబాద్, ఫిబ్రవరి 28: 'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. తనకి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. నిహారిక ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, ఆమెకి జోడీగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రిందట ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా మరో పాటను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ పాటను నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిహారిక ఈ సినిమాలో విలక్షణమైన పాత్రను పోషిస్తోందనీ, ఈ సినిమా ఆమెకి మంచి పేరు తెస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.