వైసీపీలో జూనియర్‌ ఎన్టీయార్‌ మామ...

SMTV Desk 2019-02-28 11:42:49  Jr. NTR, Jaganmohan Reddy, Srinivas Rao, YCP

అమరావతి, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నవేళ పలువురు ప్రముఖులు వైసీపీలో చేరుతున్నారు. సినీనటుడు జూనియర్‌ ఎన్టీయార్‌ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, ఈ విషయం గురించి పది రోజుల ముందే జగన్‌ను నార్నె శ్రీనివాసరావు కలిశారట.