మళ్ళి మోసం చేశారు: గంట

SMTV Desk 2019-02-28 11:09:03  Ganta Srinivas Rao, Twitter, Narendra Modi, Cheating, Vishakha Railway Zone

అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ప్రకటించినప్పటినుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు దీనిపై ఎదో విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయమే రైల్వే జోన్ విషయంలోను జరిగిందని విమర్శించారు. వాల్తేరు డివిజిన్ ను ఒడిశాకు కట్టబెట్టి ఏపీని మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటా శ్రీనివాసరావు ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ, "వైజాగ్ రైల్వేజోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభ‌జ‌నలాంటి అన్యాయ‌మే. అప్పుడు ఆదాయం ఉన్న‌ హైద‌రాబాద్ ను తెలంగాణ‌కు ఇచ్చేశారు. ఇప్పుడు రూ.6,500 కోట్లు తెచ్చే వాల్తేరు డివిజ‌న్‌ను ఒడిశాకు క‌ట్ట‌బెట్టి మళ్ళీ మోసం చేశారు.MODI cheated AP again" అని ట్వీట్ చేశారు.