వేసవి లో రాబోతున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ?

SMTV Desk 2019-02-28 10:46:48  Dear Comrade, Vijay devarakonda, Myrti movies, Rashmika mandanna, May release date, Summer season

సినీ న్యూస్, ఫిబ్రవరి 28: యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ రూపొందుతోంది. గీత గోవిందం తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మళ్ళి జోడిగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా, రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. కాగ, ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. విజయ్ దేవరకొండ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన సినిమాలను చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ సినిమా కూడా తన కెరియర్లో గుర్తుంచుకోదగినది అవుతుందని ఆయన భావిస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో మరో సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.