మరోసారి టంగ్ స్లిప్ అయిన బాలయ్య...

SMTV Desk 2019-02-27 17:50:08  Nandamuri balakrishna, ntr, kalyan ram, 118 movie pre release function

హైదరాబాద్, ఫిబ్రవరి 27: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ కెమెరామెన్ గుహన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 118 . అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే, నివేదా థామస్ హీరొయిన్లుగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఈ మధ్యే హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా నందమూరి బాలక్రిష్ణ, తారక్ ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ... ఈ సినిమా యువతరాన్ని ఆకట్టుకునేల ఉందన్నారు. నేను ట్రైలర్ చూశాను చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని బాలయ్య అన్నారు. అంతా బానే ఉండు కాని ఈ సినిమా ట్రైలర్ విషయంలో కాస్త తడబడ్డాడు బాలయ్య. 118ట్రైలర్ ని కాస్త 189చేశారు. అది గమనించిన కళ్యాణ్ రామ్, తారక్ మెల్లిగా బాలయ్య వెనక్కి వచ్చి ట్రైలర్ ను గుర్తు చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.