ప్రాణభయంతో ఇంజన్ లో కాయిన్లు వేశాడు ఓ వ్యక్తి...రూ.15 లక్షల జరిమాన విధించిన సిబ్బంది

SMTV Desk 2019-02-27 16:44:45  Man dropped coins in aeroplane engine, China, China airport

చైనా, ఫిబ్రవరి 26: క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రాకపోయినా ప్రాణాలతో మాత్రం రావాలని ఓ వ్యక్తి తన మూడనమ్మకంతో ఓ వింత పని చేశాడు. విమానంకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా గమ్యం చేరుకోవాలని అతడు దాని ఇంజిన్‌లో కాసిన్ని చిల్లర నాణేలను పడేశాడు.ప్రమాదవశాత్తు సిబ్బంది వెంటనే విషయం గ్రహించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయం కాస్త నెమ్మదిగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న 162 మందితో లక్కీ ఎయిర్ విమానం వెళ్తున్నతియాంజుషాన్ నుంచి టేకాఫ్ తీసుకోడానికి రెడీ అయింది. అందులో 28 ఏళ్ల నమ్మకాల జీవి తన భార్యకొడుకుతో కలసి ప్రయాణించాడు. అంతకు ముందే ఇంజిన్లో కొన్ని యెన్ కాయిన్లు వేశాడు. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఇంజిన్ కింద రెండు కాయిన్లు కనిపించాయి. దీంతో భద్రతా సిబ్బంది ఇంజిన్ చెక్ చేసి నోరెళ్లబెట్టారు. విమాన సర్వీసును రద్దు చేసి, దర్యాప్తు చేయగా విషయం తెలిసింది. అతణ్ని పోలీసులకు అప్పగించారు. సర్వీసు రద్దు వల్ల రూ.15లక్షల నష్టం వచ్చింది. అసలు ఇంజిన్‌లోకి డబ్బులు ఎలా వచ్చాయని సిబ్బంది ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 15 లక్షల నష్టాన్ని అతని నుంచి భర్తీ చేసుకోవాలని ఎయిర్ లైన్ యోచిస్తోంది. చైనాలో లక్కీ డబ్బుల పేరుతో చాలా చోట్ల నాణేలు పడేస్తుంటారు. విమాన ఇంజిన్లు కూడా వీటికి అతీతం కాదు. రెండేళ్ల కిందట కూడా ఓ మహిళ క్షేమంగా వెళ్లాలని డబ్బులు పడేసింది.