కుక్క కోసం భార్యను సైతం విడేందుకు సిద్ధం అయిన భర్త

SMTV Desk 2019-02-27 16:39:40  Patna, Dog, Wife, Divorce, Police, Shock

పాట్న, ఫిబ్రవరి 27: బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త పెంపుడు కుక్క కోసం కట్టుకున్న భార్యను సైతం వదిలేయడానికి వెనకాడటం లేదు. అసలు విషయం... పాట్నాలోని గాంధీ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేయటానికి ఓ మహిళ వచ్చింది. పెంపుడు కుక్కను వదిలిపెట్టమని అడిగినందుకు తన భర్త విచక్షణా రహితంగా కొట్టాడని పోలీసుల ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కుక్క కోసం తనకు విడాకులు ఇవ్వడానికి కూడా భర్త సిద్ధంగా ఉన్నాడని వాపోయింది. ఆమె ఫిర్యాదు విన్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొద్దిరోజుల తర్వాత పోలీసులు మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్తను కౌన్సిలింగ్‌కు పిలిచారు. ఈ విషయమై అతన్ని ప్రశ్నించగా, "తను నన్ను వదిలేయాలనుకుంటే వదిలేయొచ్చు.. నాకేం సమస్యలేదు" అని అతడు బదులిచ్చాడట. ఈ సమాధానం విన్న పోలీసులు ఒక్కసారిగా ఆచర్యపోయారు. కాగా భర్త తనను తరుచూ ఇబ్బందులు పెట్టాడని, పలుమార్లు చేయికూడా చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. మార్కెట్‌ కు కూడా వెళ్లనివ్వడని ఆవేదన వ్యక్తం చేసింది.