పాకిస్తాన్ లో విమాన రాకపోకలు రద్దు..

SMTV Desk 2019-02-27 13:31:57  Pakistan, Airports, Pakistan Army

పాకిస్తాన్, ఫిబ్రవరి 27: పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. తమ దేశంలోని అన్ని విమానాశ్రయాలన తక్షణం మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలన్నింటినీ రద్దు చేసామని పాక్ వెల్లడించింది. లాహోర్, ముల్తాన్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, సియాల్ కోట్ తదితర ఎయిర్ పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేవరకు తిరిగి తెరవరాదని పేర్కొంది.

ఇప్పటికే టేక్ ఆఫ్ అయిన విమానాలని కూడా తక్షణమే సమీప విమానాశ్రయాలలో ల్యాండ్ చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ లోని విమానాశ్రయాలన్నీ పాక్ సైన్యం అధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ విమానాలను పాకిస్తాన్ సైనికుల సేవలకు వినియోగించనున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.