రవితేజ 'డిస్కో రాజా' షూటింగ్ ఆగిపోయింది

SMTV Desk 2019-02-27 13:05:49  Disco Raja, Raviteja, VI Anand

హైదరాబాద్, ఫిబ్రవరి 27: మాస్ మహారాజ రవితేజ కొంత కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఆయన తర్వాత చేయబోయే సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రవితేజకు సినిమా స్క్రిప్ట్ నచ్చట్లేదట.

డిస్కో రాజా కథ వేరే సినిమా కథను పోలి ఉండడంతో మళ్ళీ కథలో మార్పులు చేయాలనీ రవితేజ భావిస్తున్నాడు. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ ఆపేసి కథను మార్చే పనిలో పడ్డాడు దర్శకుడు. కాగా ఈ కథకు తగు మార్పులు చేర్పులు చేసి సెట్స్ పైకి ఎప్పుడు తీసుకెళ్తారో చూడాలి మరి.