కొత్త సిరీస్‌తో వంద రూపాయల నోట్లు!

SMTV Desk 2019-02-27 10:05:29  New Hundred Rupees Notes, RBI, Shakthikanth Das, Mahatma Gandhi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారతీయ రిజర్వు బ్యాంకు మరో కొత్త నిర్ణయం తీసుకోనుంది. అతి త్వరలోనే సరికొత్త సిరీస్‌తో కొత్త వంద రూపాయల నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో వస్తున్న ఈ నోట్లపై యథావిధిగా మహాత్మాగాంధీ ఫొటో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం వాడకంలో ఉన్న వంద రూపాయల నోట్లలానే ఇవి ఉంటాయని తెలిపింది. ఇప్పటికే చలామణిలో ఉన్న నోట్లు కొనసాగుతాయని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది.