టిడిపికి ఆస్తి జూనియర్ ఎన్టీఆరే : కాంగ్రెస్ ఎమ్మెల్యే

SMTV Desk 2019-02-27 09:58:59  Jaggareddy, Sangareddy MLA, Congress MLA, TDP party, Nara Brahmini, Junior NTR,

సంగారెడ్డి, ఫిబ్రవరి 27: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి రాజకీయాల్లో చక్కగా రాణించగలరని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడప్పుడే చంద్రబాబు ఆమెను రాజకీయాల్లోకి రానివ్వబోరని, ఓ పదేళ్ల తరువాత రప్పించవచ్చని ఆయన అంచనా వేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత పర్యటనలు జరిపిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, బ్రాహ్మణికి రాజకీయాల్లో ఎదురుండదని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకే ఓ పెద్ద ఆస్తి అని ఆయన అభిప్రాయపడ్డారు.