శ్రీ రెడ్డి న్యూ పోస్ట్...సీన్ రివెర్స్

SMTV Desk 2019-02-26 17:57:04  Srireddy, Actress, Daggupaati rana, daggubaati abhiram, srireddy facebook post about daggupaati family

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేశంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బడా బడా వ్యక్తులపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంచలన ఆరోపణలు చేస్తూ వివాదస్పద మహిళాగా పేరుతెచ్చుకున్న నటి శ్రీ రెడ్డి. ఇన్నిరోజులు తమిళంలో ఓ సినిమా ఆఫర్ రావడంతో చెన్నైకి వెళ్లి కొద్దిరోజుల పాటు తన ఆరోపణలను పక్కన బెట్టింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపోయిందో ఏమో మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలెట్టింది. రీసెంట్ గా కొరటాల శివని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మీద పడింది. హీరోయిన్ త్రిషని రానా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని, తనను అభిరామ్ ముద్దాడుతున్న ఫోటోని కలిపి పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈ రెండు ఫోటోలు పెట్టి దగ్గుబాటి ఫ్యామిలీని తిట్టిపోసింది. పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రివర్స్ లో శ్రీరెడ్డిని తిట్టిపోస్తున్నారు. మీ ఇంట్లో వాళ్లు నిన్ను ఇలానే పెంచారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.