అమెజాన్ కు టాలీవుడ్ నిర్మాతల రిక్వెస్ట్...

SMTV Desk 2019-02-26 17:55:18  Amazon, Amazon prime, Tollywood producers request to amazon

హైదరాబాద్, ఫిబ్రవరి 26: సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ కి అమ్మితే ఆ సినిమా నిర్మాతల పరిస్తితి ఇక అంతే సంగతి. అమెజాన్ కు అమ్మిన ఏ సినిమానైన విడుదల తరువాత నెల రోజులు తిరక్కుండానే అమెజాన్ ప్రైమ్ లో దాన్ని పెట్టేస్తున్నారు. ఈ విషయంలో వారు ఎక్కడా రాజీ పడరు. ఇక దీని తీరును చూసి టాలీవుడ్ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు అమెజాన్ యాజమాన్యానికి ఓ రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారట. అదేంటంటే.. సినిమాను అమెజాన్ కి అమ్ముతారు. ముప్పై రోజుల్లో ప్రైమ్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ థియేటర్ లో సినిమా వేసేప్పుడు మాత్రం ప్రారంభంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ అనే టైటిల్ కార్డ్ వేయకుండా ఉంటామని నిర్మాతలు రిక్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా చేస్తే సినిమా అమెజాన్ కి వస్తుందా..? లేదా..? అనే విషయం తెలియక జనాలు సినిమా చూస్తారని నిర్మాతల ఆలోచన. మరి దీనికి అమెజాన్ అంగీకరిస్తుందో లేదో చూడాలి!