హైద్రాబాద్‌లో మత కల్లోహాలను సృష్టించింది వీరే : చంద్రబాబు

SMTV Desk 2019-02-26 15:54:11  TDP, YSRCP, AP Assembly elections, Chandrababu, YS jagan mohan reddy

అమరావతి, ఫిబ్రవరి 26: ఈ రోజు టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....వైసీపీపై మరోసారి నిప్పులు చెరిగారు. ప్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ మాత్రం హైద్రాబాద్‌లో ఉందని ఈ రెండింటికి వ్యూస్ ఢిల్లీ నుండి అందుతున్నాయని బాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే గల్లీ గల్లీకి రౌడీలు పుట్టుకొస్తారని చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీని మరో బీహార్‌ చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. దెందులూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొన్న ఘటనలను చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. గతంలో హైద్రాబాద్‌లో వీరే మత కల్లోహాలను సృష్టించారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా కూడ ఓటర్ల జాబితాను తారు మారు చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని బాబు ఆరోపించారు. ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఎర్ర చందనం ఆదాయం అయిపోయేసరికి వైసీపీ నేతల్లో ప్రస్టేషన్ నెలకొందన్నారు.