మాజీ కార్పోరేటర్ దారుణ హత్య....

SMTV Desk 2019-02-26 15:52:53  Congress party former corporator, Visakhapatnam, akkayyapalem, Vijayareddy

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా మాజీ మహిళా కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఈ రోజు ఉదయం బాత్ రూమ్ వద్ద ఆమె రక్తపు మడుగులో శవమై కనిపించింది. పూర్తి వివరాల ప్రకారం...గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్ గా పనిచేసిన విజయారెడ్డి...అక్కయపాలెం ఎన్జీవోస్ కాలనీలోని పద్మభాస్కర అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. ఆమె తాను నివసించే అపార్ట్ మెంట్ ని అమ్మేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొందరు దుండగులు.. అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చామని చెప్పి.. ఇంటికి వచ్చి.. ఆమెపై దాడిచేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.