ప్రభాస్ కి పోటీగా మహేష్...?

SMTV Desk 2019-02-26 13:12:36  Prabhas, Maheshbabu, Saaho, Maharshi teaser

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులని అలరించడానికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సినిమాలు సందడి చేయనున్నాయి. ప్రభాస్ నటిస్తున్న సాహో , మహేష్ బాబు మహర్షి చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మహర్షి సమ్మర్ లో ధియేటర్ లో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, సాహో ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే ఈ ఇద్దరు హీరోలు ఇప్పటి నుండే పోటీ పడటం మొదలు పెట్టినట్టున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. మర్చి 3న సాహో మేకింగ్ వీడియో షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 ను విడుదల చేయనున్నారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మార్చి 4న మహేష్ సినిమా మహర్షి టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో ఈ రెండు వీడియోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.