తెలంగాణలో రేపే ఇంటర్మీడియట్ పరిక్షలు

SMTV Desk 2019-02-26 12:43:02  Intermediate Exams, Telangana, Hall Tickets, Exam Center App

హైదరాబాద్, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. రేపు(బుధవారం) మొదలవుతున్న ఈ పరిక్షలు మార్చి 13 వరకు జరగనున్నాయి. ఈ పరిక్షల నిర్వహణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులకు ఆదేశాలు అందాయి.

కాగా, విద్యార్థులు 8.45కు సెంటర్ లోపలికి వెళ్లిపోవాలని, ఉదయం 9 గంటలకు ఒక్కనిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరని బోర్డు అధికారులు చెప్పారు. ఈ పరిక్షల కొరకు 1277 సెంటర్లు ఏర్పాటు చేశారు. 1277 చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, 1277 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పరీక్షల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. 9,42,719 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని వీరిలో4,52, 550 మంది మొదటి సంవత్సరం 490169 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. నేటి సాయంత్రం నుండి ఆన్‌లైన్‌లో హల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి ఎగ్జామ్ సెంటర్ app కూడా ఉంది. ఆ యాప్‌లో హల్ టికెట్స్ నంబర్ ఎంటర్ చేసి సెంటర్ ఎక్కడ వుందో తెలుసుకోవచ్చు. కాగా, హల్‌టికెట్స్ లేకుంటే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరని తెలిసిందే.