భారత్ సర్జికల్ స్ట్రైక్ పై మోదీ సమావేశం

SMTV Desk 2019-02-26 12:09:02  Surgical Srike, Pakistan, indian Air Force, Narendra Modi

న్యూడిల్లీ, ఫిబ్రవరి 26: ఈరోజు ఉదయం పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన 3.30 గంటల సమయంలో విరుచుకుపడింది. పాక్ సైన్యం, ఉగ్రవాదులు ఏం జరుగుతోందో గుర్తించేలోగానే పని పూర్తిచేసుకు వచ్చింది. 12 మిరేజ్-2000 ఫైటర్ జెట్స్ ద్వారా 1000 కేజీల బాంబులతో ఎల్వోసీకి అవతల విధ్వంసం సృష్టించింది.

ఈ వైమానిక దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మోదీ నివాసంలో రక్షణ, ఆర్ధిక శాఖ మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. భారత సలహాదారు అజిత్ దోవల్ మోదీకి భారత్ జరిపిన దాడుల గురించి వివరించారు. వాయుసేన సాధించిన విజయం, ప్ర్తస్తుత పరిస్థితిపై చర్చించారు. ఇకపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత అధికారులు హాజరయ్యారు.

భారత్ జరిపిన ఈ వైమానిక దాడులతో పాక్ బెంబేలెత్తి పోయింది. ఈ దాడిపై పాక్ ఏ విధంగా స్పందించినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. కాసేపట్లో సైనికాధికారులు, విదేశాంగ శాఖ మీడియాతో సమావేశం కానున్నారు.