ఐఏఎఫ్ పైలట్లకు అభినందనలు తెలిపిన రాహుల్

SMTV Desk 2019-02-26 12:00:36  Rahul Gandhi, Wishes to Soldiers, Narendra Modi, Twitter

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఈ తెల్లవారుజామున భారత సైన్యం, పాకిస్తాన్ ఉగ్రవాదుల శిభిరాలపై ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లోని చొచ్చుకెళ్లి, ముజఫరాబాద్, బాలాకోట్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించిన భారత వాయుసేన దళాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్ అంటూ అభినందించారు. మోదీ సర్కారు నిర్వహించిన రెండో సర్జికల్ స్ట్రయిక్స్ పై దేశవ్యాప్తంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.