మంత్రులందరికీ గట్టిగా క్లాస్, విమర్శలకు స్పందించండి

SMTV Desk 2019-02-26 11:41:16  Chandrababu Naidu, Ministers, Criticized, KTR, TDP

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ లో నిన్న(సోమవారం) కేబినెట్ సమావేశాలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరికీ గట్టిగా క్లాస్ తీసుకున్నాడంట. ప్రతిపక్షాలు మన ప్రభుత్వ తీరుపై, మన అభివృద్ధి పై, సంక్షేమ పథకాలపైనా చేస్తున్న ఆరోపణలపై మీరెందుకు స్పందించడం లేదని అందరిని నిలదీశారంట. వాళ్ళే పూర్తిగా తప్పు చేస్తున్నారని, వాళ్లకు ఘాటుగా సమాధానం చెప్పడంలో విఫలమవుతున్నామని చంద్రబాబు ఆరోపించారు. అంతే కాకుండా వారు విమర్శించినప్పుడు మనం ఎదుర్కోకపోతే వారి తప్పుడు ప్రచారాలు నిజమవుతాయని చంద్రబాబు అన్నారు.

అలాగే, మంత్రులుగా ఉండి కూడా ప్రతిపక్షాల నోరు ముయించాకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా విఫలమేనని చంద్రబాబు అన్నారు. తెలంగాణ నేత కేటీఆర్ చేస్తున్న విమర్శలపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. రానున్న ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిపక్షాల ఆరోపణలు మరియు విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు మంత్రులందరినీ కూడా ఆదేశించారని సమాచారం.