పరిటాల వారింట్లో పెళ్లి సందడి షురూ.. చంద్రబాబును ఆహ్వానించిన సునీత

SMTV Desk 2017-08-03 17:05:30  paritaalaa sunitha son marriage

హైదరాబాద్, ఆగష్టు 3 : దివంగత నేత పరిటాల రవి, మంత్రి సునీతల కుమారుడి పెళ్లి సందడి మొదలైంది. ఈ అక్టోబర్ 1వ తేదీన శ్రీరామ్ వివాహం జరగనుంది. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో నిశ్చితార్థ వేడుక జరుపుకోనున్నారు. గత కొంత కాలంగా ఈ పెళ్లిపై జిల్లాలో చర్చ సాగుతోంది. ఈ చర్చకు మంత్రి సునీత తెరదించారు. పరిటాల శ్రీరామ్‌ పెళ్లి అక్టోబరు 1వ తేదీన జరగనుందని కార్యకర్తల సమావేశంలోనే అధికారికంగా ప్రకటించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు, పరిటాల కుటుంబ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలానికి చెందిన ఏవీఆర్ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టర్‌ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానతో శ్రీరామ్ వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ మహోత్సవానికి మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కలిసి పరిటాల సునీత, శ్రీరామ్ లు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు.