గడిచిన 100రోజుల్లో 3,092 ఫిర్యాదులు పరిష్కరించాం: నారా లోకేష్

SMTV Desk 2017-08-03 17:05:11  Nara Lokesh, AP IT Minister , AP Govt, AP CM, TDP

అమరావతి, ఆగష్టు 3: ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి నారా లోకేష్ పదవి చేపట్టి 100రోజులు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గడచిన 100రోజుల్లో అంతర్జాలం ద్వారా 5000 ఫిర్యాదులు అందాయని అన్నారు. వాటిలో 3,092 ఫిర్యాదులను పరిష్కరించామని తెలుపడానికి సంతోషిస్తున్నానన్నారు. మిగిలిన ఫిర్యాదులను అతి త్వరలోనే పరిష్కరిస్తామని అదే పనిలో నిమగ్నమైయ్యామని చెప్పారు. తన శాఖలకు మొత్తం 1842 ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో 759 పరిష్కరించామని తెలిపారు.