'సాహో'లో తమన్నా

SMTV Desk 2019-02-25 17:44:21  saaho, tamannah, prabhas, bahubali

హైదరాబాద్, ఫిబ్రవరి 25: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో . బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలే ఉన్నాయి. అంతకు మించిన అంచనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుజిత్.

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది అక్టోబరులో ఈ సినిమా తొలి టీజర్‌ను విడుదల చేశారు. షేడ్స్‌ ఆఫ్‌ సాహో-చాప్టర్‌ 1 పేరుతో దాదాపు 1.22 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రానికి విశేషమైన స్పందన లభించింది.

అయితే ఈ చిత్ర కథానాయిక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ మార్చి 3న పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో-చాప్టర్‌ 2’ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అభిమానులు ఈ వార్తను సోషల్‌మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. #ShadesOfSaahoChapter2 అనే హ్యాష్‌ట్యాగ్‌ ఆదివారం ట్విటర్‌లో ట్రేండింగ్ గా మారింది.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. తమన్నా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు సమాచారం. కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాహో లో తమన్నా ఉందా, లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే....