చాలా రోజుల తర్వాత రాజ్యసభకు హాజరైన సచిన్ టెండూల్కర్!

SMTV Desk 2017-08-03 16:44:05   Tendulkar was nominated to the Rajya Sabha in 2012 by Congress, Bollywood senior actress line, Samajwadi Party MP Naresh Aggarwal

న్యూఢిల్లీ, ఆగస్టు 3 : భారత క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ ను కాంగ్రెస్ 2012 లో రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుల్లో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ, క్రికెట్ దిగ్గజం సచిన్ మాత్రమే తక్కువ హాజరు శాతం కలిగిన సభ్యులు కావడంతో ఈ విషయాన్ని ఎంపీ నరేశ్ అగర్వాల్ గతంలో కూడా ప్రస్తావించారు. రాజ్యసభ సమావేశాలకు, చర్చలకు హాజరుకాని పక్షంలో వీళ్లిద్దరూ తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన గతంలో ఉచిత సలహాలు ఇవ్వడమే కాదు, డిమాండ్ కూడా చేశారు. రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు ఈ రోజు రాజ్యసభకు హాజరయ్యారు. రాజ్యసభకు సచిన్ హాజరుకావడం లేదంటూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ విమర్శించిన మర్నాడే టెండూల్కర్ హాజరుకావడం ఆశ్చర్యం.