ప్రభాస్ కి పోటీ ఇవ్వబోతున్న ఇద్దరు హీరోలు

SMTV Desk 2019-02-25 16:05:43  Naani, Sharwanand, Prabhas, Saaho, Gang leader

హైదరాబాద్, ఫిబ్రవరి 25: నాని నటించిన జెర్సీ సినిమా ఇంకా విడుదల కాకముందే, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకి నిన్న నాని పుట్టిన రోజు సందర్భంగా గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సినిమాను ఆగస్టు 29వ తేదీన విడుదల చేయనున్నట్టుగా సినీ వర్గాల సమాచారం. ఆగస్టు15వ తేదీన ప్రభాస్ సాహో రానుంది గనుక, దాని ప్రకారం ఈ తేదీని విక్రమ్ కుమార్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే శార్వానంద్, సమంత జంటగా నటిస్తున్న 96 రీమేక్ ని కూడా ఆగస్టులోనే విడుదల చేసే ఆలోచనలో వున్నారని సమాచారం. నాని సినిమాకి దగ్గరలోనే శర్వానంద్ సినిమా రిలీజ్ వుండే అవకాశాలు వున్నాయని తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు ప్రభాస్ సాహో కి గట్టి పోటీ ఇవ్వగలుగుతాయో లేదో చూడాలి మరి.