రాజకీయాల్లోకి రాబర్ట్‌ వాద్రా...!

SMTV Desk 2019-02-25 15:59:07  Robert Vadra, Priyanka Gandhi, Rahul Gandhi, Politics, Entry, Lok Sabha, Elections

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఈమధ్యే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరీ, ప్రియాంక గాంధీ రాజకీయల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా ప్రజా జీవితంలోకి రావాలని ఉందంటూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో ఆయనను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సోమవారం యూపీలోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ప్రియాంక గాంధీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించి నెల తిరక్కుండానే ఆమె భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్‌ వాద్రా రాజకీయాల్లో తాను చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నటు​ ఇటీవల సంకేతాలు పంపారు.

తాను దేశ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే తాను రాజకీయాల్లోకి వస్తే భారీ వ్యత్యాసం ఉంటుందంటే ఎందుకు రాకూడదని ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక మొరాదాబాద్‌లో వాద్రా పేరిట వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. రాబర్ట్‌ వాద్రాజీ మొరాదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని స్వాగతిస్తు న్నామని ఆ పోస్టర్ల ద్వారా చెప్పారు.