'సాహో'లో తమన్నా...?

SMTV Desk 2019-02-25 13:58:56  Saaho, Prabhas, Sujith, Making Video, Shraddha kapoor, Thamannah

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గతేడాది ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో ఒక మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోకి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మార్చి 3న శ్రద్ధ్హా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా మరో మేకింగ్ వీడియో షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2 ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబందించిన మరొక వార్త ఇప్పుడు హల చల్ చేస్తుంది. ఈ సినిమాలో తమన్నా కూడా కనిపిస్తుందని లేటెస్ట్ టాక్. ఇందులో ఓ ఐటెం సాంగ్ వుంది. ఈ పాటలో తమన్నా మెరవనుందని తాజా సమాచారం. కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.