మీ రాష్ట్ర అభివృద్ధి మీరు చూసుకోండి...

SMTV Desk 2019-02-25 13:52:03  Chandrababu Naidu, Jaganmohan Reddy, KTR, Prashanth Kishor, Bihar, TDP, YCP, Janasena

అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మండిపడ్డారు. వైసీపీ కి మద్దతుగా ఉంటూ చంద్రబాబు పై విమర్శలు చేసిన కేటీఆర్ వాఖ్యలపై స్పందించిన చంద్రబాబు, మీరందరు కలిసి వచ్చిన కూడా నన్ను ఓడించలేరు. రానున్న ఎన్నికల్లో మళ్ళి అధికారం చేపట్టేది టీడీపీనే అని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా మీరందరు కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారని, మీకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని చంద్రబాబు అన్నారు. అనవసరంగా నన్ను విమర్శించడం కాదు మీరు మీ రాష్ట్ర్రంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని చంద్రబాబు కేటీఆర్ కి సవాల్ విసిరారు.

కాగా జగన్ రాజకీయాలను నేరమయం చేశారని, జనసేన, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని, రాష్ట్రంలో రౌడీయిజం సహించేదిలేదన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఎవరూ కులముద్ర వేయలేదని, ఇప్పుడు జగన్ ఆ సాహసం చేస్తున్నారన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ ఏపీని మరో బీహార్ చేయాలని చూస్తున్నారని, బీహార్ రాజకీయాలు ఏపీలో చెల్లవని, జగన్, ప్రశాంత్ కుప్పిగంతులు నాదగ్గర పనిచేయవని చంద్రబాబు అన్నారు.