'సాహో' మేకింగ్ వీడియోకి తమన్ మ్యూజిక్

SMTV Desk 2019-02-25 13:43:49  Saaho, Prabhas, Shraddha Kapoor, Sujith, Thaman

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సాహో . ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతేడాది ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 మేకింగ్ వీడియో అందరిని ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం ఈ చిత్ర యూనిట్ కష్టానికి తగ్గ ప్రతిఫలం గట్టిగానే ఉండబోతుందని ఆ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది.

ఆ వీడియోలో ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతం యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఆ వీడియో మొత్తానికి తమన్ అందించిన సంగీతం అలాగే ప్రభాస్ ఎంట్రీలో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ వీడియోని సూపర్ హిట్ చేసింది. ఇప్పుడు శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా మరో మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేయనుంది. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 కి కూడా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నాడు. తన మ్యూజిక్ తో మొదటి వీడియోని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన తమన్ ఇప్పుడు ఈ రెండో వీడియోకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వనున్నాడో మార్చి 3న తెలుస్తుంది.