కర్ణాటక మంత్రి నివాసంలో రెండో రోజు ఐటీ దాడులు

SMTV Desk 2017-08-03 16:01:47  The residence of Karnataka Minister Deekey Shivakumar, IT department searches, 44 MLAs

కర్ణాటక, ఆగస్టు 3 : కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నివాసంలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో బుధవారం కర్ణాటక ఢిల్లీ సహా వేర్వేరు రాష్ట్రాల్లో శివకుమార్ కు సంబంధించిన ఇళ్ల నుంచి సుమారు రూ. 10 కోట్లకు పైగా నగలు స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో శివకుమార్ కు బీనామి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఐటీ శాఖ అధికారులు ఈ అంశంపై ఆయనను ప్రశ్నించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తమ సంఖ్య బలాన్ని కాపాడుకునేందుకు ఆ రాష్ట్ర నుంచి 44 మంది ఎమ్మెల్యేలను పార్టీ నేతలు బెంగుళూరు తరలించారు. అక్కడి ఎమ్మెల్యేల క్యాంపును డీకే శివకుమారు పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన నివాసాలపై ఐటీ సోదాలు కుట్రపూరితమని కాంగ్రెస్ విస్మరిస్తుండగా, భాజపా వారి విమర్శలని కొట్టి పారేసింది. నల్ల ధనంపై జరిగే పోరులో కాంగ్రెస్ నేతలు సైతం తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు భాజపా నాయకులు చెబుతున్నారు. పన్ను ఎగవేత కేసులో శివకుమార్ నివాసంలో సోదాలు చేప్పటిన ఐటీ అధికారులు బుధవారం ఢిల్లీలో సుమారు రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ. 2.3 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో ఆభరణాలు లభించాయి.