జగన్ మళ్ళీ ప్రతిపక్ష నేతగానే మిగిలిపోతారా...?

SMTV Desk 2019-02-25 13:11:42  Jagan, Survey, Andhra Pradesh elections

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 25: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీ ఎలాంటి ఫలితాలను రాబడుతుంది అన్న అంశం పై పలు రకాల సర్వే ఫలితాలు బయటకు వస్తుంటాయి. అయితే ఈ సర్వే ఫలితాల ప్రకారం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనుకుంటే ఒక్కోసారి ఎవ్వరూ ఊహించని విధంగా సర్వే ఫలితాలు తలకిందులు అయిపోతాయి. దీంతో సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు మాదే అనుకున్న నేతలు ఒక్కోసారి ఓటమిని చవి చూడక తప్పదు. అప్పటికప్పుడు ఎన్నికలు పెట్టినా, లేక పూర్తిస్థాయిలో ప్రచారాలు ముగిసిన తర్వాత ఎన్నికలు పెట్టినా, ఫలానా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది అని సర్వేలలో తేలుతుంది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక గెలుస్తుందనుకున్న పార్టీ చిత్తుగా ఓడిపోతుంది. అయితే ఈ సర్వేలను పార్టీలకు సంబందించిన వారు నిర్వహించుకోవడంతో పాటు జాతీయ మీడియా మరియు ఇతరులు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ సర్వేలే ఏపీలో రానున్న ఎన్నికల్లో జగన్ కొంప ముంచేలా ఉన్నాయా ? అన్న సందేహం ఇప్పుడు వస్తుంది. ఏపీ లో జగన్ బలం ఎలా ఉన్నప్పటికీ గడిచిన ఎన్నికల్లో చాలా సర్వేలలో జగన్ కే ఆంధ్ర ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని తేల్చి చెప్పేసారు.

కానీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఆ ఎన్నికల్లో అకస్మాత్తుగా ఏర్పడిన పరిణామాల వలన జగన్ ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏపీలోని జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని వచ్చిన ప్రతీ ఒక్క సర్వేలలోను ఎవరూ అందుకోలేనంత ఎత్తులో జగన్ కు మెజార్టీ వస్తుందని తేలింది..మరి ఇదే సర్వేల ఫలితాలు ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయా లేక కొంత మంది రాజకీయ విశ్లేషకులు మరియు మేధావులు చెప్పిన విధంగా సర్వే ఫలితాలు తలకిందులయ్యి జగన్ మరోసారి ప్రతిపక్ష నేత గానే మిగిలిపోతారా అన్నది వేచి చూడాలి.