100 మిలియన్ మార్కుని అందుకున్న 'గీత గోవిందం'

SMTV Desk 2019-02-25 13:06:44  Geetha Govindam, Youtube, Sriram, Vijay Devarakonda, Rashmika

హైదరాబాద్, ఫిబ్రవరి 25: యంగ్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. విజయ్ కెరీర్ లో అర్జున్ రెడ్డి తర్వాత భారీ హిట్ గా నిలిచిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది “గీత గోవిందం”అనే చెప్పాలి. రష్మికా మందన్నా హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పైరసీ భూతం భయపెట్టినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

అంతే కాకుండా ఈ చిత్రానికి సంగీతం అందించిన గోపి సుందర్ ఇచ్చిన పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో అన్ని పాటల కన్నా
సిద్ద్ శ్రీ రామ్ పాడిన "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే" పాట గతేడాది వచ్చిన ఆల్బమ్స్ అన్నిటికంటే ది బెస్ట్ గా నిలిచింది. అందరికీ విపరీతంగా ఈ పాట నచ్చడంతో యూట్యూబ్ లో కూడా ఈ పాటను గట్టిగానే చూసేసారు. దీనితో ఇప్పుడు ఈ వీడియో సాంగుకే యూట్యూబ్ ఈ రోజుకి 100 మిలియన్ వ్యూస్ మరియు 4 లక్షల లైక్స్ వచ్చాయి.ఈ విధంగా విజయ్ 100 మిలియన్ మార్కుని అందుకున్న హీరోగా నిలిచాడు.