హర్రర్ థ్రిల్లర్ 'విశ్వామిత్ర' ట్రైలర్

SMTV Desk 2019-02-25 13:00:30  Vishwamitra, Telugu Movie, Horror movie, Raj Kiran director,

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలలో మనకి టక్కున గుర్తొచ్చేవి ప్రేమకథ చిత్రం, గీతాంజలి. స్వాతి, నవీన్ చంద్ర జంటగా త్రిపుర సినిమా హార్రర్ థ్రిల్లర్ తన ప్రతేయ్కతను చూపించింది. ఇప్పుడు గీతాంజలి,త్రిపుర తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కిరణ్. ఈయన తాజాగా మరో హారర్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నాడు. నందితా ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, 'విశ్వామిత్ర' అనే టైటిల్ ను ఆయన ఖరారు చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరి కాంబినేషన్స్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సస్పెన్స్ .. హారర్ నేపథ్యంలో సీన్స్ నే ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. 'అతను సీసీ కెమెరాలో ఎందుకు రికార్డు కాలేదో నాకు అర్థం కావడం లేదు' .. 'చచ్చినోడు బతికొచ్చి నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాడంటే నమ్మడానికి నేను పిల్లోణ్ణి కాదు .. పోలీసోణ్ణి' అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమైన పాత్రల్లో అశుతోష్ రాణా .. ప్రసన్న .. సత్యం రాజేశ్ .. జీవా కనిపిస్తున్నారు. వచ్చేనెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.