సోనాక్షిసిన్హాపై పోలీస్ కేసు

SMTV Desk 2019-02-25 12:43:23  Sonakshi Sinha, Police Case, Event Organization, Fraud

లక్నో, ఫిబ్రవరి 25: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హాకు ఎదురుదెబ్బ తగిలింది. సోనాక్షిసిన్హా సహా మరో ఐదుగురిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌ను మోసం చేసినందుకు ఈ కేసు నమోదైందని సమాచారం. ఢిల్లీలో జరిగిన ఓ బహుమతుల కార్యక్రమానికి సోనాక్షిసిన్హాను ఆహ్వానించామని, ఇందుకు ఓ కంపెనీకి రూ.24 లక్షలు అందజేశానని పేర్కొంటూ ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గతేడాది నవంబర్‌లో కాట్‌ఘర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆమె తమ కార్యక్రమానికి రాకపోగా, డబ్బు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సోనాక్షిసిన్హా సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.