సొంతగడ్డపై ఆసిస్ కు చుక్కలు చూపెట్టేందుకు సిద్దమైన కోహ్లీ సేనా....

SMTV Desk 2019-02-23 19:51:29  India vs Australia, T20, ODI, Vizag, Virat kohli, MS Dhoni, Rishab pant

వైజాగ్, ఫిబ్రవరి 23: వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న టీం ఇండియా నెల రోజుల విరామం తరువాత ఆసిస్ తో ఫస్ట్ టీ20 మ్యాచ్ తో తలపడేందుకు సిద్దంగా ఉంది. ఆస్ట్రేలియా గడ్డపైనే కంగారూలను పరుగులు పెట్టించిన భారత్.. సొంతగడ్డపై ఎటువంటి ప్రదర్శన ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడైనా టీం ఇండియా పై విజయం సాధించి తమ పరువు నిలబెట్టుకోవాలని ఆసిస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక భారత్ ఆటగాళ్ళ విషయానికొస్తే ధోనికి బాగా కలిసొచ్చిన పిచ్, విరామం తర్వాత బరిలోకి దిగుతున్న విరాట్, పూర్తి ఫామ్‌లో కనిపిస్తున్న హిట్టర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు ఆసీస్‌ను చిత్తు చేసేందుకు సిద్ధమయ్యారు. కేఎల్ రాహుల్‌ను మరోసారి అదృష్టం వరించగా ఈ సారైనా ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. మహేంద్రుడి అనుభవం జట్టుకు సులువైన విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారంతా. ఇక ఆలౌరౌండర్లు కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్ తీవ్రంగా చెమటోడ్చి సత్తా నిరూపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనింగ్ పెద్ద సమస్యగా మారింది. మార్కస్ స్టోనిస్, ఆరోన్ ఫించ్‌లు సైతం చక్కటి ఓపెనింగ్ ఇవ్వలేకపోతున్నారు. భారమంతా ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కాంబ్ మీదే కనబడుతోంది. గ్లెన్ మాక్స్ వెల్, షాన్ మార్షల్‌లు ఏ మాత్రమైనా నిలబడితేనే మ్యాచ్ మీద ఆశలు నిలబడతాయి.

జట్ల అంచనా:

భారత్:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి( కెప్టెన్), ధోనీ (వికెట్ కీపర్), రిషభ్ పంత్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్య, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్

ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), మార్కస్ స్టోనిస్, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, ఆష్టన్ టర్నర్/షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్