కెఎ పాల్ బయోపిక్ టైటిల్...?

SMTV Desk 2019-02-23 18:17:08  ka paul, prajashanthi party chief, andrapradesh assembly elections, ka paul biopic, ka paul biopic title

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ తన బయోపిక్ ను ఎవరైనా తీయవచ్చని కాని వారికి మూడు నెలల టైమ్ మాత్రమే ఇస్తానని బయోపిక్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తితో బాండ్ స్క్రిప్ట్ రెడీ చేయించినట్లు చెప్పిన పాల్ బయోపిక్ తీస్తే పెట్టాల్సిన టైటిల్ పై కూడా ముందే క్లారిటీ ఇచ్చారు. ఇక సాంగ్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టినట్లు చెబుతూ విశ్వవిజేత అని యూ ట్యూబ్ లో అల్ రెడీ రిలీజ్ చేసినట్లు చెప్పారు. ద మోడర్న్ డే గాంధీ.. వరల్డ్ మోస్ట్ పాపులర్.. 8th వండర్ ఆఫ్ ది వరల్డ్.. ఇలా రకరకాల టైటిల్స్ గురించి వివరణ ఇచ్చిన పాల్ ఎక్కువగా మోడర్న్ డే గాంధీ అనే టైటిల్ బావుంటుందని అన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు అందరూ తనను గాంధీ సుభాష్ చంద్రబోస్ లతో పిలుస్తున్నారని ఆ విధంగా నన్ను చూడటం భావ్యం కాదని పాల్ క్లారిటీ ఇచ్చారు.