ప్రియా ప్రకాష్ వారియర్‌ వల్ల నా కెరియర్ లాస్ అయ్యింది : నురీన్

SMTV Desk 2019-02-23 18:06:13  Lovers day movie, Oru adaar love, Priya prakash varrior, Noorin shereef

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ‘ఒరు ఆడార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’పేరుతో ఫిబ్రవరి 14 విడుదలైన ఈ సినిమా మంచి ఎమోషన్స్‌తో సాగే కథ ఇది. కాని కన్నుకొట్టి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రియా వారియర్ వల్ల సినిమాను అంతా చెత్త చెత్త చేశారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది సహ నటి నూరిన్ షరీఫ్. తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ బ్యూటి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ఒరు ఆడార్ లవ్’ చాలా మంచి ఎమోషన్స్‌తో సాగే సినిమా. ఈ సినిమాలో మొదట నాది లీడ్ రోల్. అయితే ఈ చిత్ర టీజర్‌లో ప్రియా వారియర్ కన్నుకొట్టే సీన్ పెట్టారు. అది సంచలనం కావడంతో కథను మొత్తం మార్చేసి నా పాత్ర ప్రాధాన్యత తగ్గించేశారు. కేవలం ఆమె పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు. చివరికి లీడ్ రోల్‌ని సపోర్టింగ్ రోల్‌గా మార్చి.. సపోర్టింగ్ రోల్‌ని లీడ్ రోల్ చేసేశారు. ఇలా చేయడం ద్వారా చాలా నిరాశకు గురయ్యా. చాలా సందర్భాల్లో ఆవేదనకు గురయ్యా. ఇక మీదట ప్రియా ప్రకాష్ వారియర్‌తో కలిసి నటించే అవకాశం వస్తే ఆలోచిస్తా.. నటించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా.. కాని ‘ఒరు ఆడార్ లవ్’ హీరో రోషన్‌తో మళ్లీ అవకాశం వస్తే చేస్తా. ఒకరకంగా నా కెరియర్ లాస్ అయ్యింది అంటే దానికి కారణం ప్రియా వారియర్ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నురీన్.