సౌరవ్ గంగూలీ సీఎం అవ్వాలని ఆరాటపడుతున్నట్లున్నాడు : పాక్ మాజీ కెప్టెన్

SMTV Desk 2019-02-23 17:08:34  pakistan captain javed miandad, indian cricketer sourav gangooly, pulwama attack, india-pak cricket match banned

పాకిస్తాన్, ఫిబ్రవరి 23: పుల్వామా దాడి కారణంగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ‘మ్యాచ్ బహిష్కరణ’ అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ చాలా ఘాటుగా స్పందించారు. ఈ మధ్యే మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ...పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని సూచించిన గంగూలీ.. ఒక్క క్రికెట్‌ అనే కాదు.. హాకీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్ దాయాది దేశంతో భారత్ ఆడకూడదని సూచించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16 భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ‘సౌరవ్ గంగూలీ రాబోవు ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడుతున్నాడేమో..? అతను ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నట్లున్నాడు. అందుకే.. ప్రచారం కోసం ‘మ్యాచ్ బహిష్కరణ’ వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. పుల్వామా దాడి తర్వాత భారత్ వ్యవహరిస్తున్న తీరుపై మాకేమీ చింతలేదు. పాకిస్థాన్ ఎప్పుడూ భారత్‌‌తో శాంతిపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ.. ప్రతిసారి భారత్ నెగటివ్‌గానే స్పందిస్తోంది’ అని మియాందాద్ వెల్లడించాడు.