దర్శకుడు కోడి రామక్రిష్ణకి అస్వస్థత...!

SMTV Desk 2019-02-22 17:21:28  Kodi Ramakrishna, Health issue, Director

హైదరాబాద్, ఫిబ్రవరి 22: అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సినిమాకి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. కొంతకాలం క్రితం ఆయన పెరాలసిస్ వ్యాధితో బాధపడ్డారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం వెంటిలటర్ పై ఆయనకి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కోడి రామకృష్ణ.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.