'ఎన్టీఆర్ మహానాయకుడు' పై ఎన్టీఆర్ మనవరాలు ఏమంటుంది?

SMTV Desk 2019-02-22 13:24:15  Nara Bhamhini, Balakrishna, NTR Mahanayakudu

ఎన్టీఆర్ బయోపిక్ రెండవభాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా చుసిన బాలకృష్ణ కూతురు నారా బ్రహ్మిని మాట్లాడుతూ...

"తెలుగు చిత్రపరిశ్రమకి తాతగారు ఎంత గుర్తింపును తీసుకువచ్చారో కథానాయకుడు సినిమాలో చూసాం. ఆ సినిమాకి మించిన స్థాయిలో మహానాయకుడు ను అద్భుతంగా ఆవిష్కరించారు. తెలుగు జాతికి ఆయన ఎంతటి గౌరవాన్ని తీసుకొచ్చారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు.

ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వాంగా అనిపిస్తోంది. మహోన్నతమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నీ, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రూపొందించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా చూడాలి. ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా, నా తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.