ఏపీ సీఎంపై ఫిర్యాదు..

SMTV Desk 2019-02-21 21:40:59  EX CS IYR KrishnaRao, Governor narasimhan, AP Cm, Chandrababu naidu

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రధానమంత్రి నరేంద్రమోడీయే కారణం అని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అదే అర్థం వచ్చేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

కాగా ఇటీవల సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్రమోడీ ఏ అరాచకానికైనా సమర్థుడేనని..గోద్రాలో రెండు వేల మందిని బలి తీసుకున్న నరమేధాన్ని మరవలేమని... ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఆయనను అనుమతించలేదు. విదేశాలు కూడా మోడీని బాయ్‌‌కాట్ చేశాయని... సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరమని, సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయం లబ్ధి చూడరాదు’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడ్డ బీజేపీ నేతలు దేశ ప్రధానిపై అలంటి వ్యాఖ్యలు చేసినందుకు గవర్నర్ కి ఫిర్యాదు చేసారు.